ముకుమ్మడి తనిఖీలు-ముడు గంటల సేపు హడవిడి…?
సివిల్ సప్లైస్,లీగల్ మెట్రాలజీ,ఫుడ్ సేఫ్టీ….
ఈ వార్త పూర్తిగా చదివితే మీకే అర్ధం అవుతుంది..?
జిల్లాలో విధులు నిర్వహిస్తున్న అధికారులకు ఒక్కసారిగా బాధ్యతలు గుర్తుకు వచ్చినట్లు వుంది…ఒక్క సారిగా మూడు శాఖల అధికారులు తనిఖీలు,హెచ్చరికలు,నోటీసులు…. వంట గదులను శుభ్రంగా వుంచుకోవాలి, చెదలు పట్టకుండా,ఎలుకలు,బొద్దింకలు,పురుగులు రాకుండా చూసుకోవాలి….రికార్డు మొయిటెన్ చేయాలి లేకుంటే చట్ట పరమైన చర్యలు వుంటాయి అంటూ హైవే వెంబడి డాబాలు, హోటళ్లు, రెస్టారెంట్ల ఓనర్లకు జాగ్రత్తలు చెప్పారు…. రేపటి నుంచి హైవే ప్రక్కన వున్న డాబాలు, హోటళ్లు, రెస్టారెంట్లు ఓనర్లు ప్రజలకు పరిశుభ్రంగా పుడ్ వడ్డిస్తారు……???? ఈ అధికారులను ఎం అనాలి?? కోస మెరుపు… ప్రజాఫిర్యాదుల పరిష్కర వేదిక లో వచ్చిన ఫిర్యాదుల మేరకు..
నెల్లూరు: గూడూరు పట్టణలో నేషనల్ హైవే వెంబడి హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార భద్రతా ప్రమాణాల అమలు, తూకాలు-కొలతలు, కమర్షియల్ గ్యాస్ వినియోగంపై సివిల్ సప్లైస్ శాఖ,లీగల్ మెట్రాలజీ శాఖ,ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి సంయుక్త తనిఖీలు నిర్వహించారని ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సంయుక్త తనిఖీలలో హోటళ్లు,రెస్టారెంట్లలో ఉపయోగిస్తున్న ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత, గడువు తేదీలు, నిల్వ విధానాలు, వంటశాలల పరిశుభ్రత, త్రాగునీటి సదుపాయాలు, సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత వంటి అంశాలను పరిశీలించారు. అలాగే వినియోగదారులకు అందజేస్తున్న ఆహార పదార్థాలు ఆహార భద్రత,ప్రమాణాల నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలించారు.డాబాలు, హోటళ్లు,రెస్టారెంట్స్ ఓనర్లకు హెచ్చరికలు చేయడంతో పాటు జాగ్రత్తలు చెప్పారు. మళ్లీ తప్పులు చేస్తే చట్టపరమైన చర్యలు వుంటాయని తెలిపారంటా.?
ముద్రలేని కటాలను:- సివిల్ సప్లైస్ శాఖ అధికారులు, హోటళ్లు,రెస్టారెంట్లలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు వాడుతున్నారా లేదా అని తనిఖీ చేశారు. లీగల్ మెట్రాలజీ శాఖ అధికారులు వాడుతున్న ఎలక్ట్రానిక్ తూకపు యంత్రాలు,కొలత పరికరాల ఖచ్చితత్వాన్ని పరిశీలించి, సంబంధిత ధృవీకరణ ముద్రలు ఉన్నాయా లేదా అనే విషయాన్ని నిర్ధారించి , అందులో ముద్రలేని కటాలను గుర్తించి కేసులను నమోదు చేసినారు.
పరిశుభ్రంగా ఉండాలని ఆదేశించారు:- తనిఖీల సందర్భంగా పలు సంస్థలలో లైసెన్సులు, నమోదు ధృవపత్రాలు, ముడి పదార్థాల కొనుగోలు బిల్లులు, నిర్వహణ రికార్డులను పరిశీలించారు. లోపాలు గుర్తించిన చోట్ల సంబంధిత యాజమాన్యాలకు నోటీసులు జారీ చేయడంతో పాటు, తక్షణ సవరణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఒక హోటల్ నందు వంటగది నందు ఎక్సపైరీ కాబడిన ప్యాకెట్లను గుర్తించి కేసు నమోదు చేసినారు. విద్యానగర్ సర్కిల్ నేషనల్ హైవే నందు కల హోటళ్ల నందు ప్లాస్టిక్ క్యారీ బ్యాగులలోఆహార పదార్ధములను ఉంచి ఫ్రిజ్ లలో నిల్వచేయరాదని ఆదేశించారు. ఫ్రిడ్జ్ లలో నిల్వవుంచిన మాంసాహారమును 15 కేజీ లను ధ్వంసం చేశారు. డాబాలు రెస్టారెంట్లలో వంట గదులలో ఫ్లోరింగ్, సీలింగ్, గోడలు పరిశుభ్రంగా ఉండాలని ఆదేశించారు.
ఈగలు, ఎలుకలు, పురుగులు:- ప్రతి రోజు హోటల్ నందు వ్యాపారం ముగిసిన తరువాత హోటల్ ఇంచార్జ్ తమ సిబ్బంది చేత వంటగది, డైనింగ్ ఏరియా, పరిసరాలను పూర్తిగా శుభ్రపరచుకోవలసినదిగా ఆదేశించారు.వారానికి ఒక సారి పూర్తి స్థాయిలో తమ హోటల్ ప్రాంగణము మొత్తం పెస్ట్ కంట్రోల్ చేయించవలసినదిగా ఆదేశించారంటా. ప్రతి రోజు వంటశాలలు శుభ్రముగా ఈగలు, ఎలుకలు, పురుగులు వంట ప్రదేశములో లేకుండా చూసుకోవాలి. లైసెన్స్ ఉన్న పెస్ట్ కంట్రోల్ సేవల్ని ఉపయోగించాలంటా,రికార్డు మెయింటైన్ చేయాలంటా.?

