ఇరాన్ తో ఒప్పందమా?యుద్దమా? సిద్దం అవుతున్న అమెరికా
అమరావతి: అమెరికా, ఇరాన్ తో చర్చలు జరుగుతున్నట్లు ప్రకటిస్తునే, మరో వైపు ఇరాన్ పై దాడికి దిగేందుకు అమెరికా సిద్ధం అవుతున్నది అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే పశ్చిమ ప్రాంతం వైపున ఉన్న గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ఇరాన్ పౌర విమానయాన సంస్థ, సిబ్బందికి నోటమ్ జారీచేసింది. ఈనెల 25 వరకు అన్ని విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు తుదిదశకు చేరుకున్నాయని, ఒప్పందానికి సంబంధించిన చాలా అంశాల్లో ఇరుదేశాల మధ్య సయోధ్య కుదిరినట్లు తెలుస్తోంది. దీంతో ఏ క్షణమైనా ఒప్పంద ప్రకటన వెలువడే అవకాశముంది. ఇదే సమయంలో దౌత్య ప్రయత్నాలు చివరి నిమిషంలో విఫలమైతే, ఇరాన్ పై మళ్లీ దాడులు చేసే విషయాన్ని అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఏ నిమిషానికి ఎం జరుగుతుందొ వేచిచూడాలి.?

