ఆదివారం 45- 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం-విపత్తుల నిర్వహణ సంస్థ
శనివారం గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45.8 డిగ్రీలు..
అమరావతి: రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగుతుందని,ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. శనివారం కృష్ణా(జి) కానుమోలు 45.8 డిగ్రీలు, అనకాపల్లి(జి) మాకవరపాలెంలో 45.5 డిగ్రీలు నమోదు అయినట్లు వెల్లడించింది. అలాగే రాష్ట్రంలోని 28 జిల్లాలకుగాను 13 జిల్లాల పరిధిలోని 95 మండలాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని వెల్లడించింది.
మే 24 ఆదివారం:- ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45- 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.అలాగే మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, అనకాపల్లి,కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42- 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
వర్షాలు కురిసే అవకాశం:- ఛత్తీస్గఢ్, ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతోందని పేర్కొంది. దీని ప్రభావంతో నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మన్యం, అల్లురి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
శనివారం గరిష్ఠ ఉష్ణోగ్రతలు:- కృష్ణా(జి) కానుమోలు 45.8 డిగ్రీలు, అనకాపల్లి(జి) మాకవరపాలెంలో 45.5, ఏలూరు(జి) కుక్కునూరు, పోలవరం(జి) కూనవరం, పల్నాడు(జి) శ్రీనగర్ 45,ఎన్టీఆర్ (జి) తొర్రగుడిపాడులో 44.6, తూర్పుగోదావరి(జి) చిట్యాలలో 44.3, విశాఖ రూరల్లో 42.8, అల్లూరి(జి) రామరాజుపాలెం, కాకినాడ(జి) కోటనందూరులో 42.6, మార్కాపురం(జి) నందనామారెళ్లలో 42.5, ప్రకాశం(జి) కొండపిలో 42.4, గుంటూరు(జి) రాయపడి 42.3డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది.

