AP&TG

తీవ్రమైన ఎండల హెచ్చరిక-ఉష్ణోగ్రతల అంచనా: 46°C – 48°C

అమరావతి:  ​రాగల మూడు గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం,మన్యం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గంటకు 50 నుండి 60 కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని వెల్లడించింది.

తీవ్రమైన ఎండల హెచ్చరిక (మే 23, శనివారం):- ఉష్ణోగ్రతల అంచనా: 46°C – 48°C : పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు 43°C – 45°C : అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి. 41°C – 43°C: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, విశాఖపట్నం, రాయలసీమ జిల్లాలు రేపు రాష్ట్రవ్యాప్తంగా 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 221 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *