మాస్కోకు చేరుకున్న ప్రధాని నరేంద్రమోదీ,ఘనస్వాగతం పలికిన రష్యా
అమరావతి: భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల రష్యా పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రం మాస్కోకి చేరుకున్నారు.. మాస్కోలో దిగిన మోడీకి తొలుత ఉపప్రధాని డెనిస్ మంటురోవ్ ఘన స్వాగతం పలికారు..అనంతరం విమానాశ్రయం నుంచి బయటకు రాగానే, భారతీయులతో పాటు రష్యన్ డ్యాన్స్ ట్రూప్స్ సాంస్కృతిక నృత్యాలతో ప్రధానిని స్వాగతించారు.. ఇందులో భాగంగా రష్యా అమ్మాయిల బృందం ‘రంగిలో మారో ఢోల్నా’ అనే రాజస్థానీ పాటకు డ్యాన్స్ వేశారు..భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా దుస్తులు వేసుకుని, డ్యాన్స్ చేశారు..ఐరోపాలో ఎత్తైన ఫ్రీ-స్టాండింగ్ నిర్మాణం అయిన మాస్కోలోని ఓస్టాంకినో టవర్, భారతదేశ త్రివర్ణ పతాకంతో వెలిగిపోయింది.. ఫిబ్రవరి 2022లో రష్యా,, ఉక్రెయిన్‌పై దాడి చేసిన తరువాత మోడీ మాస్కోకు వెళ్లడం ఇదే తొలిసారి..2019లో ఫార్ ఈస్ట్ సిటీ వ్లాడివోస్టాక్‌లో జరిగిన ఆర్థిక సదస్సుకు హాజరైనప్పుడు రష్యాలో ప్రధాని మోదీ చివరి పర్యటన చేశారు..