కరూర్ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు చెల్లవు-హైకోర్టు
సీఎం విజయ్ కి దెబ్బ..
ప్రభుత్వ ఉద్యోగాన్ని ఉచితంగా పంచిపెట్టేది కాదు..
అమరావతి: కరూర్ తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై మద్రాస్ హైకోర్టు సోమవారం నాడు ఉత్తర్వులను రద్దు చేసింది.తొక్కిసలాట ఘటనపై సీబీఐ ఇంకా దర్యాప్తు చేస్తోందని, సుప్రీంకోర్టు ఈ విచారణను పర్యవేక్షిస్తోందని కోర్టు పేర్కొంది.
ప్రభుత్వ ఉద్యోగాన్ని ఉచితంగా పంచిపెట్టేది కాదు:- ఈ కేసుకు సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని తెలిపింది. రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలని అక్షింతలు వేసింది. ప్రభుత్వ చర్యలపై నియంత్రణ ఉండాలని సూచించింది. లేదంటే అరాచకం, అశాంతి రాజ్యమేలుతాయని హెచ్చరించింది. “ప్రభుత్వ ఉద్యోగాన్ని ఉచితంగా పంచిపెట్టేది కాదని” కష్టపడి సాధించాలని, ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంతోమంది ఆశగా ఎదురుచూస్తున్నారని ఈ సందర్భంగా మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది.

