హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను తొలగించండి-హైకోర్టు
చీఫ్ సెక్రటరీకి అదేశాలు..
కోర్టులు అదేశాలు ఇచ్చిన ఆమలు చేయాల్సింది ప్రభుత్వమే కదా??
హైదరాబాద్: తెలంగాణలో హైడ్రాపై వస్తూన్న వరుస వివాదాలపై తెలంగాణ హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను తొలగించాలని చీఫ్ సెక్రటరీని ఆదేశిస్తూ, అర్హత కలిగిన మరో అధికారిని నియామించాలని ఆదేశించింది. 63 కోర్టు ధిక్కరణలపై ఉన్నత న్యాయ స్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇన్ని ఉల్లంఘలనకు పాల్పడుతున్న అధికారిని ఇంకా కొనసాగిస్తే రూల్ ఆఫ్ లా అదుపు తప్పుతుందని,రంగనాథ్ స్థానంలో ఐజీ స్థాయి అధికారిని నియమించాలని తెలిపింది. గతంలోను హైకోర్టు రంగనాథ్‌ను పద్ధతి మార్చుకోవాలని పలు మార్లు హెచ్చరించింది. ప్రైవేట్ ఆస్తి వివాదంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వ్యవహారశైలిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఒకే అంశానికి సంబంధించి ఏకంగా మూడు కోర్టు ధికరణ పిటిషన్లు దాఖలవడం అత్యంత తీవ్రమైన విషయమని వ్యాఖ్యానించింది. కోర్టు ఉత్తర్వులను పదేపదే ఉల్లంఘించడం వెనుక కారణమేమిటని నిలదీసింది. ప్రైవేటు ఆస్తిలో జోక్యం చేసుకోవద్దని స్పష్టమైన ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ వాటిని లెకచేయకుండా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించింది. కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన అలవాటుగా మారిందా? కోర్టు ధికరణనే పరిపాటిగా మార్చుకున్నారా? అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.

