AP&TGDISTRICTSPOLITICS

ఊటుకూరులో వేమిరెడ్డికి చెందిన వ్యక్తి ఇంట్లోకి మార్చారు-మాజీమంత్రి అనిల్ కుమార్

వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పెద్ద తోపు కాదు.

డబ్బుండే వాళ్లే మోసం చేయడంలో దిట్ట..

నెల్లూరు: వైట్ కాలర్ వాళ్లు చేసే పనులే వేమిరెడ్డి చేస్తున్నాడని,ముమ్మాటికి అక్రమ మైనింగ్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హస్తం వుందని తీవ్రస్థాయిలో మాజీమంత్రి అనిల్ కుమార్ ఆరోపణలు చేశారు. మంగళవారం అయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రెండు రోజుల క్రితం మైనింగ్ అక్రమాలపై ప్రశ్నిస్తే ఇంతవరకు సమాధానం లేదని,ప్రెస్ మీట్ తరువాత అపార్ట్మెంట్ నుంచి ఆఫీస్ ని..? ఊటుకూరులో వేమిరెడ్డికి చెందిన వ్యక్తి ఇంట్లోకి మార్చారని ఆరోపించారు. నేను ఆధారాలతో మాట్లాడుతున్నాను కాబట్టి ఈరోజు లేదా రేపు వేమిరెడ్డి దంపతులు చంద్రబాబును కలిసి నన్ను అరెస్టు చేయమని ఖచ్చితంగా అడుక్కుంటారని తెలిపారు. అసలు వేమిరెడ్డికి “డౌ” కి లింక్ ఏంటని జరిగిన దారుణలపై ప్రశ్నిస్తే… ఏం సంబంధం లేదని రవిచంద్ర మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు. కేంద్ర మంత్రి జైశంకర్ కి స్వయంగా వేమిరెడ్డి లేఖ రాశారని, అందులో చైనా కు చెందిన 5 మందికి ఇక్కడ మైనింగ్ వ్యాపారానికి అనుమతి ఇవ్వాలని వేమిరెడ్డి కోరారని తెలిపారు. అందులో ఒకడు ఈ “డవ్”.. ఈ డవ్,,, ఎవరి చెంచా అనేది తేలిపోయిందన్నారు.

 వేమిరెడ్డి ఆధ్వర్యంలో అక్రమ వసూళ్లు చేస్తున్నారని ఆరోపిస్తున్నా:- 2024 -11-05 మేయర్ గా గిరిజన మహిళా ఉంది… కానీ మేయర్ గా మరోవ్యక్తి చైనాలో చలామనీ ఎలా అవుతాడు. వేమిరెడ్డికి చెందిన రమణకుమార్ అనే వ్యక్తితో కలిసి ఈ ఫేక్ మేయర్ చైనాలో ఇంకెన్ని దారుణాలు చేసాడో అని అనుమానాలు ఉన్నాయన్నారు.

సినోమా అనే కంపెనికి వెళ్లి నేనే మేయర్ ని అంటూ రమణకుమార్ తో కలిసి చీటింగ్ చేశారు.దేశ పరువును చైనాలో తీస్తున్నారు. ఇది తీవ్రమైన నేరం. ఇది ప్రభాకర్ రెడ్డికి తెలియదా? తెలిసే చేశారా? అంటూ ప్రశ్నించారు.

చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ,,,ఫ్రాడ్ చేసిన వ్యక్తిని ఎందుకు వెనకేసుకొస్తున్నారు?-  ఫేక్ మేయర్ తో ఇంకెన్ని స్కాములు చేసారో వెంటనే బయటపెట్టండి. తెలిసి కూడా దగ్గరపెట్టుకుని ఉన్నాడంటే వేమిరెడ్డితో లోపాయాకరీ ఒప్పందం ఉందనే అనుమానాలు ఉన్నాయి. మైన్ తో పాటు ఇంకా ఎన్ని రహస్యాలు వెళ్తున్నాయో బయటపెట్టాలి

ఇట్లాంటి నేరగాడిని రవిచంద్ర వెనకేసుకోస్తారా… నారాయణ, శ్రీధర్ రెడ్డిని,,,ప్రశ్రిస్తూన్నా? దేశ పరువును పక్కా దేశాల్లో తాకట్టు పెడుతున్న ఫేక్ మేయర్ ని నెత్తిన పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నారు?

వైట్ కలర్ క్రిమినల్స్ పట్ల:- ఇప్పటికైనా బాధ్యత ఉంటే వేమిరెడ్డి బయటికి వచ్చి క్లారిటీ ఇవ్వాలి… ఇలాంటి వ్యక్తిని డిప్యూటీ మేయర్ స్థానం నుంచి వెంటనే తొలగించాలిదీనంతటికీ బాస్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి… డబ్బున్నోళ్లు మోసం చేయరా..వైట్ కలర్ క్రిమినల్స్ పట్ల మీ వైఖరి ఏంటి వేమిరెడ్డి… పక్కా ఆధారాలు చూపించా… కూటమి ప్రభుత్వం ఇలాంటి దొంగ పనులు ఇంకెన్ని చేస్తుందో  అనేది మాకు అనుమానం?

దేశాద్రోహనికి పాల్పడిన ఘటనపై ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేస్తాం… అక్కడి నేషనల్ మీడియాకి పూర్తి వివరాలు వెళ్లడిస్తాం.. ఇలాంటి ఫ్రాడ్ గురించి మాట్లాడాలంటే స్థాయి ఉండాల్సిన అవసరం లేదు. మా స్థాయి ఏంటో మాకు తెలుసు… మైన్స్ ఉంటేనే మైన్ గురించి మాట్లాడాలా… నాకు మైన్స్ లేవు… ఓనర్ల బాధలు నాకు చెప్పారు కాబట్టే మాట్లాడుతున్నా? రాజకీయ సేవ ముసుగులో దేశాద్రోహలకు పాల్పడుతున్నారు…ఇది తప్పని చెప్తున్నాం.. మేము కూడా సేవలు చేశాం… కానీ ఇలాంటి ఫ్రాడ్ లు చేయలేదు? విజయ్ మాల్యా.. జి ఎంటర్టైన్మెంట్ అధినేత ఇంకా ఎంతోమంది డబ్బుండే వాళ్లే మోసం చేస్తున్నారు వేమిరెడ్డి కూడా అలాగే చేస్తున్నాడు. దమ్ముంటే దీనిపై మాట్లాడాలి అంటూ సవాల్ విశారారు.??

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *