జిల్లా పరిషత్ నూతన ఛైర్మన్,వైస్ ఛైర్మన్ గా పొలంరెడ్డి,ప్రసాద్ లు ప్రమాణ స్వీకరం
నెల్లూరు: అధికారులు,నాయకుల సహకారంతో మారు పల్లె ప్రాంతాలతో సహ,జిల్లా అభివృద్దికి తన శాయశక్తుల కృషి చేస్తానని జిల్లా ప్రజాపరిషత్ నూతన ఛైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన పొలంరెడ్డి.శ్రీనివాసులురెడ్డి తెలిపారు.శుక్రవారం జిల్లా కలెక్టర్ హిమాన్షు నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రమాణం చేయించిన అనంతరం జడ్పీ ఛైర్మన్ పొలంరెడ్డి మాట్లాడారు. అంతంకు ముందు ప్రిసైడింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల, జిల్లా ఎన్నికల పరిశీలకురాలు సదా భార్గవి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ పొలంరెడ్డి.శ్రీనివాసులురెడ్డి,వైస్ ఛైర్మన్ గా వైస్ చైర్మన్గా పొట్టేళ్ల ప్రసాద్ ల ఎన్నిక ప్రక్రియ పూర్తి అయింది. ప్రమాణ స్వీకారంకు 35 మండలాల జడ్పిటిసిలు హాజరు అయ్యారు. జడ్పిటిసిలతో కలెక్టర్ ప్రమాణ స్వీకారం చేయించారు.ఈకార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటకృష్ణారెడ్డి, పాశం సునీల్ కుమార్ తదితరులు హజరైయ్యారు.

