పురమిత్ర యాప్ ద్వారా సమస్యలు ఫిర్యాదు చేయవచ్చు-కమిషనర్ నందన్
ఇంటి వద్ద నుంచే చెల్లింపులు..
నెల్లూరు: నగర ప్రజలు తమ ప్రాంతాల్లో ఎదురయ్యే వివిధ సమస్యలను నేరుగా నెల్లూరు నగరపాలక సంస్థ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, వివిధ మున్సిపల్ పన్నులు, చార్జీలను సులభంగా చెల్లించేందుకు పురమిత్ర (Puramitra) యాప్*ను వినియోగించుకోవాలని కమిషనర్ వై.ఓ నందన్ బుధవారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.
పురమిత్ర యాప్ ద్వారా… ఫిర్యాదుల నమోదు (Grievance Redressal)
ఈ యాప్ ద్వారా సమస్యలపై ఫిర్యాదులు నమోదు చేయవచ్చు:–
- పారిశుధ్యం, చెత్త సేకరణ సమస్యలు–2. తాగునీటి సరఫరా సమస్యలు–3. వీధి దీపాల సమస్యలు–4. రోడ్లు, రోడ్లపై గుంతల సమస్యలు–5. మురుగునీటి కాలువలు, డ్రైనేజీ సమస్యలు–6. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (UGD) సమస్యలు–7. పార్కుల నిర్వహణ సమస్యలు–8. ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు, ఇతర ఆక్రమణల సమస్యలు–9. అక్రమ నిర్మాణాలకు సంబంధించిన ఫిర్యాదులు–10. ఫుట్‌పాత్‌లపై అక్రమ దుకాణాలు, ఆక్రమణలు–11. ఆస్తి పన్నుకు సంబంధించిన ఫిర్యాదులు–12. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన సమస్యలు–13. ఇతర మున్సిపల్ సేవలకు సంబంధించిన ఫిర్యాదులు.
- ఆన్లైన్ చెల్లింపులు (Online Payments)-
పురమిత్ర యాప్ ద్వారా ప్రజలు ఇంటి వద్ద నుంచే కింది చెల్లింపులు చేసుకోవచ్చు:–
- ఆస్తి పన్ను (Property Tax) చెల్లింపు.
- నీటి ఛార్జీలు (Water Charges) చెల్లింపు.
- ట్రేడ్ లైసెన్స్ ఫీజు (Trade License Fee) చెల్లింపు.
Puramithra App Download Link-https://play.google.com/store/apps/details?id=com.dreamstep.apcmmscitizen
III. ప్రజలకు విజ్ఞప్తి…
ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన వివరాలు, ఫోటోలతో యాప్‌లో ఫిర్యాదులు నమోదు చేయవచ్చు. సంబంధిత అధికారులు ఫిర్యాదులను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని కమిషనర్ సూచించారు. అలాగే మున్సిపల్ కార్యాలయాలకు వెళ్లే అవసరం లేకుండా ఆన్లైన్లోనే పన్నులు, ఇతర ఛార్జీలను చెల్లించుకోవచ్చని తెలిపారు.

