జనాభా గణన–2027 ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి-జె.సి మొగిలి వెంకటేశ్వర్లు
నెల్లూరు: నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ సెంటర్లో భారత జనాభా గణన–2027లో భాగంగా ఫేజ్–II జనాభా లెక్కల సేకరణ (Population Enumeration)కు సంబంధించి రెండు రోజుల శిక్షణ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరైL జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, శిక్షణలో పాల్గొన్న జిల్లా సెన్సస్ అధికారులు, మండల స్థాయి చార్జ్ ఆఫీసర్లు, అదనపు చార్జ్ ఆఫీసర్లు, సెన్సస్ క్లర్కులు, టెక్నికల్ అసిస్టెంట్లకు పలు సూచనలు చేశారు. జనాభా లెక్కల సేకరణలో ఖచ్చితత్వం, సమన్వయం, బాధ్యతాయుతమైన విధి నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. నవంబర్ 9, 10 తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ శిక్షణ కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ కార్యాలయం నుంచి విచ్చేసిన ఏడి రమాదేవి, జిల్లా కోఆర్డినేటర్ రాజమోహన్ రెడ్డి తదితరులు శిక్షణ అందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్, జిల్లా పంచాయతీ అధికారి వెంకట్రామన్, జడ్పీ సీఈఓ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.

