INTERNATIONALNATIONALOTHERS

ప్రధాని నరేంద్ర మోదీ చాలా టఫ్…ట్రంప్

అమరావతి: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. మోదీ చాలా టఫ్ అని, సమర్థుడైన నాయకుడని కితాబునిచ్చారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరుగుతున్న 23వ ఆసియాన్ సమావేశాల్లో పాల్గొనేందుకు అక్కడికి చేరుకున్న ట్రంప్,ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. ఆసియాన్ సమావేశాల నేపథ్యంలో క్వాడ్ దేశాల కూటమి నేతలైన భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంతొనీ ఆల్బనీస్, జపాన్ ప్రధాని టకాయిచీతో కలిసి ట్రంప్ మరో సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారితో కలిసి ఫొటో దిగే సమయంలో మోదీ చాలా టఫ్ అని కామెంట్ చేశారు. ఆ తరువాత జపాన్ ప్రధాని వైపు చూస్తూ ఆమె ఇంకా టఫ్ అని అన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ,, మోదీ తనకు మంచి స్నేహితుడని, ఆయనతో తనకు మంచి అనుబంధం ఉందని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు అద్భుతంగా ఉన్నాయని, పరస్పర సమన్వయంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. క్వాడ్ కూటమి ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన భాగస్వామ్యాల్లో ఒకటిగా నిలుస్తోందని అభిప్రాయపడ్డారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *