AP&TG

తుఫాను ముప్పుపై సీఎం చంద్రబాబు సమీక్ష

19, 20 తేదీల్లో కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన..

అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశం..

అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి సమీక్ష నిర్వహించారు. అల్పపీడనం సోమవారం సాయంత్రానికి వాయుగుండంగా, ఆ తర్వాత తుఫానుగా బలపడే సూచనలు ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. తుఫాను కదలికలు, తీవ్రత, ప్రభావంపై ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేయాలని సూచించారు. ఈ నెల 19, 20 తేదీల్లో కోస్తాంధ్ర తీర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గతంలో వచ్చిన ఆర్నబ్ తుఫాను తరహాలోనే ప్రస్తుత తుఫాను ప్రభావం కూడా ఉండవచ్చని అంచనా వేశారు. కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు తదితర జిల్లాలపై తుఫాను ప్రభావం ఉండే అవకాశం ఉందని వివరించారు. ఇటీవల రాష్ట్రంలో తుఫాను నష్టాన్ని అంచనా వేసేందుకు వచ్చిన కేంద్ర బృందం చేసిన సిఫార్సులను కూడా పరిగణనలోకి తీసుకుని క్షేత్రస్థాయిలో అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *