AP&TG

నెల్లూరు-తుని ప్రాంతాల మధ్య’అత్యంత తీవ్ర తుపాను’గా తీరం దాటే అవకాశం

అమరావతి: ఆగ్నేయ దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గడచిన 6 గంటలుగా గంటకు 6 కిలోమీటర్ల వేగంతో ఉత్తర-వాయవ్య దిశగా కదిలిందులుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.సోమవారం ఉదయం 08:30 గంటల సమయానికి, ఇది 11.2° ఉత్తర అక్షాంశం మరియు 86.4° తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమై ఉంది. ఇది శ్రీలంకలోని ట్రింకోమలీకి తూర్పు-ఈశాన్యంగా సుమారు 630 కి.మీ, అండమాన్ & నికోబార్ దీవులలోని శ్రీ విజయ పురానికి పశ్చిమంగా 690 కి.మీ, తమిళనాడులోని చెన్నైకి తూర్పు-ఆగ్నేయంగా 700 కి.మీ, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి దక్షిణ-ఆగ్నేయంగా 800 కి.మీ మరియు ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు దక్షిణంగా 910 కి.మీ దూరంలో ఉంది. ఇది ఉత్తర-వాయవ్య దిశగా ప్రయాణాన్ని కొనసాగిస్తూ, నవంబర్ 16 సాయంత్రానికి దక్షిణ దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ‘తుపాను’గా బలపడే అవకాశం ఉంది. ఆ తర్వాత, నవంబర్ 17 సాయంత్రానికి ఇది పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ‘తీవ్ర తుపాను’గా  బలపడే అవకాశం ఉంది. తదుపరి దశలో మరింత బలపడి, పశ్చిమ-వాయవ్య దిశగా పయనిస్తూ, నవంబర్ 20 మధ్యాహ్నానికి ఆంధ్రప్రదేశ్-యానాం తీరాల మధ్య (నెల్లూరు-తుని ప్రాంతాల మధ్య) ‘అత్యంత తీవ్ర తుపాను’గా తీరం దాటే అవకాశం ఉంది. తీరము దాటే సమయములో  పెను గాలులు గంటకు 120-130 కి.మీగా ఉండి, గరిష్టంగా 145 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉంది.

వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు:-

కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:- ఈరోజు మరియు రేపు:- తేలికపాటి  వర్షాలు  ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40 నుండి 50కి.మీ గరిష్టంగా 60 కి. మీ వేగంతో వీచే అవకాశం ఉంది .

ఎల్లుండి:- తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఊరుములతో కూడిన జల్లులు కొన్ని  చోట్ల కురిసే అవకాశముంది. భారీ  వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల  కురిసే అవకాశముంది.ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 60 నుండి 70కి.మీ గరిష్టంగా 80 కి. మీ వేగంతో వీచే అవకాశం ఉంది.

రాయలసీమ:-  సోమవారం-మంగళవారం తేలికపాటి  వర్షాలు  ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

ఎల్లుండి:- తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఊరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.బలమైన గాలులు గంటకు ౩౦ నుండి 40కి.మీ గరిష్టంగా 50 కి. మీ వేగంతో వీచే అవకాశం ఉంది.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *