NATIONAL

జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో LeT కమాండర్ లతీఫ్ భట్ హతం

వెతికి,వేటాడి,హతం…

అమరావతి: జమ్మూకశ్మీర్‌లో తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కర్-ఎ-తైబా (LeT) కమాండర్ లతీఫ్ భట్ హతమయ్యాడు. జిల్లాలోని లారూ గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నట్టు సమాచారం అందడంతో భద్రతా దళాలు భారీ ఆపరేషన్‌కు తెరతీశాయి. ఆ ప్రాంతం మొత్తాన్ని జల్లెడపడుతున్న సమయంలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించిన మరో ఉగ్రవాది ఉమర్‌ అని భద్రతా దళాలు తెలిపాయి. సైన్యం, సీఆర్‌పీఎఫ్‌తో పాటు స్థానిక పోలీసుల స్పెషల్ ఆపరేషన్ గ్రూప్‌ కూడా ఉగ్రవాద ఏరివేత చర్యల్లో పాలుపంచుకుంది.

కుల్గమ్-CRPF పోస్టు దాడి చేసిన:- కుల్గమ్ లోని మీర్ బజార్ వద్ద నవంబర్ 11వ తేదిన బైక్ పై వచ్చి CRPF పోస్టు దాడి చేసి ముగ్గురు CRPF జవాన్లపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపి ఇద్దరు టెర్రరిస్టులు సమీపంలోని అడవిలోకి పారిపోయారు.జవాన్లపై జరిగిన దాడికి కుట్రపన్నింది భట్ అని భద్రతా దళాలు తెలిపాయి. గాయపడ్డ జవాన్లకు ఎలాంటి ప్రాణాపాయం లేదని CRPF అధికారులు తెలిపారు. గాయపడ్డ వారిలో ఇద్దరు ఇప్పటికే కోలుకుని ఢిల్లీకి వెళ్లారని చెప్పారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *