AP&TG

దక్షిణ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతం

నేడు తీవ్ర తుపానుగా మారే అవకాశం..

శుక్రవారం నెల్లూరు–తుని మధ్య తీరం దాటే అవకాశం..

తీరం దాటే సమయంలో గంటకు 130–145 కి.మీ వేగంతో గాలులు..

తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుపాను, ప్రస్తుతానికి చెన్నైకి 590 కి.మీ, మచిలీపట్నానికి 650 కి.మీ, విశాఖపట్నానికి 660 కి.మీ, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 780 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయిన అక్వాన్ తుపాన్, గడిచిన 6 గంటల్లో గంటకి 3 కిమీ వేగంతో కదులుతోందని వాతావరణశాఖ పేర్కొంది. రాత్రికి తీవ్ర తుపానుగా మారే అవకాశం వుందని వెల్లడించింది. తుపాను పశ్చిమ-వాయవ్య దిశగా ప్రయాణిస్తూ ఎల్లుండి ఉదయ…

ఆ తర్వాత, ఇది వాయవ్య దిశగా పయనిస్తూ, నవంబర్ 19 ఉదయానికి ‘అతి తీవ్ర తుపాను’ గా మరింత బలపడవచ్చు. అదే దిశలో ప్రయాణిస్తూ, నవంబర్ 20, 2026 మధ్యాహ్నం సమయానికి, ఇది నెల్లూరు మరియు తుని మధ్య ఆంధ్రప్రదేశ్ మరియు యానాం తీరాలను దాటే అవకాశం ఉంది. అప్పుడు ఇది ‘అతి  తీవ్ర తుపాను’గా ఉండి, పెను  గాలులు గంటకు 120-130 కి.మీ గరిష్టంగా 145 కి.మీ వేగంతో తీరాన్ని తాకే అవకాశం ఉంది.

వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు:-

కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-

ఈరోజు;- పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40 నుండి 50కి.మీ గరిష్టంగా 60 కి. మీ వేగంతో వీచే అవకాశం ఉంది.

రేపు:- తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఊరుములతో కూడిన జల్లులు  ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. పెను గాలులు గంటకు 60-70 కి.మీ గరిష్టంగా 80 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉంది.

ఎల్లుండి:- తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఊరుములతో కూడిన జల్లులు అనేక  చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల  కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. పెను గాలులు గంటకు 120 -130 కి.మీ గరిష్టంగా 145 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉంది.

రాయలసీమ:-

ఈరోజు ;-పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది.

 రేపు:- తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఊరుములతో కూడిన జల్లులు  ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు ౩౦ నుండి 40కి.మీ గరిష్టంగా 50 కి.మీ  వేగంతో వీచే  అవకాశం ఉంది.

ఎల్లుండి:- తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఊరుములతో కూడిన జల్లులు  కొన్ని  చోట్ల కురిసే అవకాశముంది.  ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40 నుండి 50కి.మీ గరిష్టంగా 60 కి. మీ వేగంతో వీచే అవకాశం ఉంది .

విద్యుత్ సమస్యల కోసం కంట్రోల్ రూమ్ నంబర్లు:- అక్వాన్ తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APCPDCL) ప్రత్యేక కంట్రోల్ రూమ్ నంబర్లను ఏర్పాటు చేసింది. తుపాను ప్రభావంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినా, విద్యుత్ సంబంధిత సమస్యలు ఎదురైనా ఈ నంబర్లను సంప్రదించవచ్చునని సూచించింది.
♦ టోల్ ఫ్రీ నంబర్: 1912
♦ కృష్ణా : 6281709355
♦ ఎన్టీఆర్ : 9440817561
♦ గుంటూరు : 9440817526
♦ బాపట్ల : 9281413774
♦ ప్రకాశం : 9440817491
♦ పల్నాడు : 7382623148
♦ మార్కాపురం : 7780420711
♦ CRDA : 8331092947

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *