AP&TG

తీరం దాటిన అక్వాన్ తుపాను-ఉత్తరాంధ్రకు వర్ష సూచన

గోపాల్‌పూర్ సమీపంలో తీరం దాటిన తుపాను..

70–90 కి.మీ వేగంతో వీచిన గాలులు..

మరో 3 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం

అమరావతి: అక్వాన్ తుపాను దక్షిణ ఒడిశాలోని గోపాల్‌పూర్ సమీపంలో శుక్రవారం ఉదయం 7.30 నుంచి 8.30 గంటల మధ్య తీరం దాటినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ  వెల్లడించింది. తీరం దాటే సమయంలో గంటకు 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు తెలిపింది. తుపాను పూర్తిగా తీరం దాటే ప్రక్రియకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని ఉదయం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.తీరం దాటినప్పటికీ శ్రీకాకుళం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్‌డీఎంఏ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ సూచించారు.

తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం:- ఉదయం 11 గంటల తాజా సమాచారం ప్రకారం అక్వాన్ తుపాను దక్షిణ ఒడిశాలోని గోపాల్‌పూర్ సమీపంలో కొనసాగుతోంది. ఒడిశా మీదుగా పయనిస్తూ రాబోయే మూడు గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఆ తర్వాతి ఆరు గంటల్లో వాయుగుండం కూడా మరింత బలహీనపడే సూచనలు ఉన్నాయని తెలిపారు. తుపాను ప్రభావంతో ఇబ్బందులు ఎదురైతే ప్రజలు ‘మనమిత్ర’ వాట్సాప్ నంబర్ 9552300009ను సంప్రదించాలని ప్రఖర్ జైన్ సూచించారు.ప్రజలు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అధికారుల సూచనలు పాటించాలని విపత్తుల నిర్వహణ సంస్థ విజ్ఞప్తి చేసింది.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *