తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నెల్లూరు అభివృద్ధికి శ్రీకారం-మంత్రి నారాయణ
కార్పొరేషన్ల నూతన విజేతలతో కలిసి దర్శించుకున్నాం..
ప్రమాణ స్వీకారానికి ముందు తిరుమల శ్రీవారి ఆశీస్సులు పొందాం..
నగర అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తాం..
తిరుమల: వచ్చే సోమవారం జరగబోయే నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల విజేతల ప్రమాణ స్వీకారానికి ముందు, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, తన టీమ్‌తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఎన్నికల్లో గెలుపొందిన విజేతలంతా కలిసి ఇలా దైవదర్శనం చేసుకోవడం ఎంతో ఆహ్లాదకరంగా, వారి నూతన ఆరంభానికి శుభసూచకంగా నిలిచింది. ఈ పవిత్ర సందర్భం కాబోయే పాలకవర్గంలో నూతన ఉత్సాహాన్ని నింపింది. ప్రజా సేవలో పూర్తి అంకితభావంతో ముందుకు సాగడానికి ఈ ఆధ్యాత్మిక అనుభూతి తమకు ఎంతో తోడ్పడుతుందని విజేతలు భావిస్తున్నారు. స్వామివారి దివ్యాశీస్సులతో నగర అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తామని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. అందరూ కలిసికట్టుగా శ్రీవారి సన్నిధికి చేరుకోవడం అందరినీ ఆకట్టుకుంది.

