NATIONAL

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జన్మదినం-రూ.47,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు

అమరావతి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జన్మదినం నాడు ఒడిశా సర్వతోముఖాభివృద్ధి కోసం దాదాపు రూ.47,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీలు శనివారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అలాగే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఒడిశాలోని మయూర్‌భంజ్‌లో జరిగిన ‘వికాస్ రా ధారా, ఒడిశా సారా’ బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు.

రాష్ట్రపతి స్వగ్రామంను సందర్శించిన ప్రధాని:- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జన్మదినం సందర్భంగా ఆమె స్వగ్రామమైన పహాడ్‌పూర్‌ను ప్రధాని మోదీ సందర్శించారు. ఈ గ్రామాన్ని వేగంగా అభివృద్ధి చేసి ‘సోలార్ విలేజ్’గా మారుస్తామని ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామంలోని ప్రతి ఇంటికీ సౌరశక్తి అందుతుంది. ఒడిశాలోని ప్రసిద్ధ కోణార్క్ సూర్య దేవాలయానికి ఉన్న గుర్తింపు తరహాలోనే, పహాడ్‌పూర్ గ్రామం కూడా ప్రపంచపటంలో పునరుత్పాదక ఇంధన కేంద్రంగా సరికొత్త గుర్తింపును పొందుతుందని ప్రధాని అన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *