DISTRICTS

ఆగస్టు 1న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ-DRO విజయకుమార్

ఓటర్ల అభ్యంతరాలు, క్లెయిమ్‌ల స్వీకరణ..

నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)–2026 కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 1న ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించనున్నట్లు జిల్లా రెవిన్యూ అధికారి విజయకుమార్ తెలిపారు.

ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్‌లో అయన మాట్లాడుతూ జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 2,460 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 16,84,176 మంది ఓటర్లు ముసాయిదా జాబితాలో ఉన్నారని తెలిపారు. ఇందులో పురుషులు 8,25,447 మంది, మహిళలు 8,58,567 మంది, ఇతరులు 162 మంది ఉన్నారని వెల్లడించారు.

ఆగస్టు 1 నుంచి ఓటర్ల జాబితాపై ఫారం-6, 6ఏ, 7, 8 ద్వారా కొత్తగా పేరు నమోదు, మార్పులు, తొలగింపులు, చిరునామా సవరణలు, EPIC వివరాల సవరణ వంటి అభ్యర్థనలను స్వీకరిస్తామని తెలిపారు. దరఖాస్తులను సంబంధిత ERO/AERO కార్యాలయాల్లో లేదా https://voters.eci.gov.in⁠ వెబ్‌సైట్ ద్వారా సమర్పించవచ్చని పేర్కొన్నారు.

ఓటరు జాబితాకు సంబంధించిన అభ్యంతరాలపై RP Act–1950 నిబంధనల ప్రకారం అప్పీల్ అవకాశం కూడా ఉందన్నారు. ఎన్నికల ప్రక్రియను ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ వివరాలను సరిచూసుకొని అవసరమైన మార్పులు చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *