AP&TG

ముసాయిదా ఓటరు జాబితాను విడదల చేసిన ఎలక్షన్ కమీషన్

అమరావతి: “సర్” ప్రక్రియ తరువాత రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ముసాయిదా ఓటరు జాబితాను CEO వివేక్ యాదవ్ విడుదల చేశారు. మొత్తం 4.16 కోట్ల మంది ఓటర్లలో 89.22 శాతం మందికి ఫారాలు అందజేశారు. సుమారు 3.71 కోట్ల మంది తమ ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించారు.ఇందులో 15.22 లక్షల మంది మృతి చెందినట్లు గుర్తించారు. 22.30 లక్షల మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారడం లేదా గైర్హాజరైనట్లు గుర్తించారు. 7.37 లక్షల మంది పేర్లు రెండు, మూడు చోట్ల నమోదైనట్లు గుర్తించి, వారి పేరు ఒకేచోట ఉంచారు. జాబితాను ecinet app,,ceo వెబ్‌సైట్‌లో ప్రజలు తనిఖీ చేకోవచ్చు. అర్హులైన ఓటర్లు ఫారం-6 ద్వారా మళ్లీ నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్స్‌, అభ్యంతరాలను స్వీకరిస్తారు. అక్టోబర్ 3వ తేదిన తుది ఓటరు జాబితాను ప్రచురిస్తారు. నోటీసు, విచారణ లేకుండా ఏ ఓటరు పేరును తొలగించబోమని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. పారదర్శక ప్రక్రియ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కట్టుబడి ఉందని సీఈవో వెల్లడించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *