16న లోకేష్ చేతుల మీదుగా ఆర్ఎస్ఆర్, డిఎస్ఆర్ స్కూళ్ల ప్రారంభం-మంత్రి నారాయణ
విద్యను మించిన ఆస్తి లేదు..
ప్రభుత్వ బడులకు మహర్దశ..
నెల్లూరు:సిటీ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలను పేద విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాలలకు దీటైన విద్య, వసతులు అందించాలనే లక్ష్యంతో ఆధునీకరిస్తున్న RSR-DSR హైస్కూల్స్ లను ఈ నెల 16వ తేదీన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఈ రెండు పాఠశాలలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
పాఠశాలల ఆధునీకరణ పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ బుధవారం తన కుమార్తె షరణితో కలిసి పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 15వ తేదీలోపు మిగిలిన పనులన్నీ పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు, నిర్మాణ సంస్థల ప్రతినిధులకు మంత్రి సూచించారు.మలి విడతలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ హైస్కూల్స్‌ను కూడా ఆధునీకరిస్తామని చెప్పారు.
విద్యార్థులతో కలిసి బాస్కెట్‌బాల్ ఆడిన మంత్రి:- పనుల పరిశీలన సందర్భంగా డిఎస్ఆర్ హైస్కూల్‌లో విద్యార్థులతో మంత్రి నారాయణ సరదాగా మమేకమయ్యారు. విద్యార్థులతో కలిసి బాస్కెట్‌బాల్ ఆడి గోల్ వేసి సందడి చేశారు. విద్యార్థుల క్రీడా ప్రతిభను అభినందిస్తూ చదువుతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

