స్వర్ణభారత్ ట్రస్ట్ రజతోత్సవాలకు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్
సెప్టెంబర్ 7వ తేదీ..
నెల్లూరు: స్వర్ణభారత్ ట్రస్ట్, వెంకటాచలం (నెల్లూరు చాప్టర్) రజతోత్సవాలకు సిద్ధమైంది. సెప్టెంబర్ 7వ తేదీ ఉదయం 11 గంటల నుంచి జరగనున్న ఈ కార్యక్రమానికి ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు స్వర్ణభారత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి దీపా వెంకట్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటలకు వెంకటాచలం చేరుకోనున్న యోగి ఆదిత్య నాథ్, 11.30 గంటలకు అక్షర విద్యాలయం ప్రాంగణంలో ఉన్న సోమా నైపుణ్య కేంద్రాన్ని సందర్శిస్తారు. అనంతరం 12.00 గంటలకు అక్షర విద్యాలయాన్ని సందర్శించి, విద్యార్థులతో ముచ్చటించనున్నారు. అనంతరం 2.00 గంటలకు స్వర్ణభారత్ ట్రస్ట్ కు చేరుకుని రజతోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రి నారాయణ,ఎమ్మేల్యే సోమిరెడ్డి తదితరలు పాల్గొంటారని స్వర్ణభారత్ ట్రస్ట్ నిర్వహణా బృందం తెలియజేసింది.

