మున్సిపల్ ఎన్నికల కోసం అనిల్ కుమార్ డైవర్షన్ పాలిటిక్స్- కప్పిర రేవతి
నెల్లూరు: మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అనిల్ కుమార్ ఉద్దేశపూర్వకంగానే డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని,టీడీపీ నగర మహిళా అధ్యక్షురాలు కప్పిర రేవతి మండిపడ్డారు.గురువారం నెల్లూరు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కప్పిర రేవతి మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్‌లపై తీవ్ర ఆరోపణలు చేశారు.
కష్టపడి సంపాదించిన వేల కోట్లు, ప్రజల సేవకే ఖర్చు చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై అనిల్ పదే పదే విమర్శలు చేయడం సిగ్గుచేటని, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మైనింగ్, గ్రావెల్ ల్యాండ్లలో కమీషన్లు తింటూ వేల కోట్ల అవినీతికి పాల్పడింది అనిల్ కుమార్ యాదవేనని ఆరోపించారు. గతంలో మున్సిపల్ ఎన్నికల సమయంలో తన ఇంట్లో కూర్చుని 1.5 కోట్లు ఆఫర్ ఇచ్చారని,తాము తిరస్కరించడంతో, తన భర్తపై అక్రమంగా సెక్షన్ 307 కేసు పెట్టి జైలుకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళనైన తనను కూడా కొట్టించడమే కాకుండా, కరోనా లాక్‌డౌన్ సమయంలో తాను 15 లక్షల నుండి 20 లక్షల వ్యయంతో నిర్మించుకున్న కేఫ్‌ను పోలీసులతో నెలమట్టం చేయించారన్నారని తెలిపారు. అనిల్ కుమార్‌కు ధైర్యముంటే ఏ గుడికైనా వచ్చి ప్రమాణం చేయడానికి సిద్ధమా అని సవాల్ విసిరారు.తన గొంతులో ప్రాణం ఉన్నంతవరకు అనిల్ అక్రమాలను నిలదీస్తూనే ఉంటానని అన్నారు.
కమీషన్లు ప్రసన్నకుమార్ రెడ్డి:- సినీ హీరోయిన్ల చుట్టూ తిరిగిన చరిత్ర ఉన్న మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, వయసు పైబడ్డాక మహిళలపై విమర్శలు చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ప్రసన్నకుమార్ రెడ్డి రోడ్లు కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు తీసుకుంటూ, ఎంపీ శ్రీనివాసులురెడ్డి నుంచి పర్సంటేజీలు మింగేశారని ఆరోపించారు.

