జనసేన పార్టీ పదవుల కోసం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం
25 పార్లమెంటు నియోజకవర్గాల్లో..
అమరావతి: జనసేన పార్టీ నిర్మాణ ప్రక్రియ కోసం చేపట్టిన జనసేన నిర్మాణ సారధుల సమాచార సేకరణ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా కోలాహలంగా ప్రారంభమైంది. ఈ సమాచార సేకరణ నిమిత్తం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక కమిటీని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నియమించారు. ప్రతి కమిటీకి ఒక ఎంపీ/ఎమ్మెల్సీ/ఎమ్మెల్యే/ కార్పొరేషన్ ఛైర్మన్/ సీనియర్ నాయకుడిని పరిశీలకుడిగా నియమించారు. పార్టీ కోసం బలంగా నిలబడ్డ క్షేత్ర స్థాయి నాయకులు, శ్రేణులు- తాము ఆశించే పదవుల వివరాలను తెలియచేస్తూ కమిటేకి దరఖాస్తు సమర్పిస్తున్నారు. ఈ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బూత్ లెవల్ నుంచి పార్లమెంట్ లెవల్ వరకు పార్టీ కోసం పని చేయడానికి, బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నవారు సమాచార సేకరణ కమిటీలు వద్దకు వచ్చి దరఖాస్తులను అందజేస్తున్నారు. ప్రత్యేకంగా మూడు డెస్క్ లు ఏర్పాటు చేసి ఎక్కడా ఏ సమాచారం మిస్ కాకుండా ప్రతి దరఖాస్తును భద్రపరుస్తున్నారు. వీరికి కేంద్ర కార్యాలయం నుంచి ఐదు మంది సభ్యులతో కూడిన బృందం సహాయసహకారాలు అందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సమాచార సేకరణ కమిటీలకు తగిన విధంగా సమన్వయం చేసేందుకు కేంద్ర కార్యాలయం నుంచి ఐదు మందితో కూడిన ప్రత్యేక సమన్వయకర్తల బృందం నిరంతరం జరుగుతున్న కార్యక్రమాలను పర్యవేక్షిస్తోంది. మొదటి రోజు ఉత్సాహభరిత వాతావరణంలో మొదలైన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. పార్లమెంట్ నియోజకవర్గ కమిటీలతో కేంద్ర కార్యాలయం నుంచి సమన్వయం చేసేందుకు అయిదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటైంది.

జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో:- ‘జనసేన పార్టీ ప్రజాస్వామ్యానికి విలువనిస్తుంది. పార్టీ నిర్మాణంలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని బలంగా ఆచరించే విధానం పవన్ కళ్యాణ్ కే సాధ్యమ’ని జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల కేంద్ర కార్యాలయ సమన్వయకర్త డాక్టర్ సందీప్ పంచకర్ల అన్నారు. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొదలైన సమాచార సేకరణ ప్రక్రియను జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సమాచార సేకరణ కమిటీలను సమన్వయకర్తలు మీడియాకు వివరించారు.

