ఉపరితల ఆవర్తన ప్రభావంతో మంగళవారం తేలికపాటి వర్షాలు
అమరావతి: ఉపరితల ఆవర్తన ప్రభావంతో మంగళవారం ఉత్తరాంధ్ర, కాకినాడ,కోనసీమ,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,ఏలూరు, కృష్ణా,ఎన్టీఆర్ జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తరు వర్షాలు,మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం.

