CRIMENATIONAL

‘జమాత్-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్’ఉగ్ర కుట్రకు సంబంధించి 13 మంది అరెస్ట్

మూడు రాష్ట్రాల్లోని మొత్తం 16 చోట్ల NIA దాడులు..

కీలకమైన పత్రాలు, ల్యాప్‌టాప్..

పరారీలో ఉన్న ముజిబుర్ రెహమాన్..

ఉగ్రవాద సంస్థ ఎజెండాను ప్రచారం చేయడం..

రహస్య సమావేశాలు, మతపరమైన..

అమరావతి: నిషేధిత ఉగ్రవాద సంస్థ అయిన ‘జమాత్-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్’కు అనుబంధ విభాగమైన ‘ఇమామ్ మహ్ముదర్ కాఫిలా’ (IMK)తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై, పశ్చిమ బెంగాల్, అస్సాం,కేరళ రాష్ట్రాలకు చెందిన 13 మందిని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) అరెస్టు చేసింది. మంగళవారం “పశ్చిమ బెంగాల్‌లోని ఐదు ప్రాంతాలతో సహా మూడు రాష్ట్రాల్లోని మొత్తం 16 చోట్ల దాడులు జరిగాయి. ఇందులో మొత్తం 13 మందిని అరెస్టు చేశారు. IMKతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై వీరిని అదుపులోకి తీసుకున్నారు,” అని NIA అధికారి ఒకరు తెలిపారు.

కీలకమైన పత్రాలు, ల్యాప్‌టాప్:- అసోంలోని బార్పేట జిల్లాలో, ఆజాద్ నగర్ నిచుకా ప్రాంతాల్లోని పలు చోట్ల NIA సోదాలు నిర్వహించింది. విచారణ కోసం అస్సాంలోని బార్పేట జిల్లాకు చెందిన ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపింది. అరెస్టు అయిన వారిని సోర్బోగ్‌కు చెందిన ఫరూక్ అబ్దుల్లా, జాకీర్ హుస్సేన్, చాంద్‌బార్ అలీ, బార్పేట రోడ్‌కు చెందిన ముస్తఫిజుర్ రెహమాన్, నిషుకాకు చెందిన యాకూబ్ అలీ, హౌలీలోని జషిహతిపరా గ్రామానికి చెందిన రకీబుల్ ఇస్లాంలుగా గుర్తించారు. ఈ ఆపరేషన్ సమయంలో అనేక కీలకమైన పత్రాలు, ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లతో సహా అనేక ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

పరారీలో ఉన్న ముజిబుర్ రెహమాన్:- బంగాల్‌లోని దక్షిణ దినాజ్‌పుర్ జిల్లా కుష్కారి ముందేహర్ గ్రామానికి చెందిన ముజిబుర్ రెహమాన్ (26) ఇంటిపై ‘జమాత్-ఉల్-ముజాహిదీన్’ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో దర్యాప్తు అధికారులు సోదాలు నిర్వహించారు. ముజిబుర్ ఇంటికి దూరంగా ఉండి చదువుకుంటుండగా, జనవరిలో పోలీసులు తమ ఇంటికి వచ్చి అతడి ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారని అతడి తండ్రి మిజానూర్ రెహమాన్ చెప్పారు. అప్పటి నుంచి ముజిబుర్ పరారీలో ఉన్నాడు. ప్రస్తుతం అతడి ఆచూకీ గానీ, కార్యకలాపాల గురించి గానీ ఎవరికీ తెలియదు. NIA వర్గాల సమాచారం ప్రకారం, ముజిబుర్‌కు ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఉగ్రవాద సంస్థ ఎజెండాను ప్రచారం చేయడం:- బంగాల్, అసోం, త్రిపురతో సహా ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాద భావజాలాన్ని విస్తరించేందుకు IMK పన్నిన కుట్రలో నిందితులు చురుకుగా పాల్గొన్నట్లు NIA దర్యాప్తులో తేలింది. ఈ కుట్రలో ఉగ్రవాద సంస్థ ఎజెండాను ప్రచారం చేయడం, సులభంగా ప్రభావితమయ్యే యువతను తీవ్రవాదం వైపు మళ్లించడం, భారతదేశంలో ఆ సంస్థ నెట్‌వర్క్‌ ను విస్తరించడం లక్ష్యంగా పెట్టుకుంది.

రహస్య సమావేశాలు, మతపరమైన:- భారత్​లో నిషేధిత సంస్థ JBM దుర్మార్గపు ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి, ఆ సంస్థకు చెందిన సీనియర్ సభ్యుడు ఇమామ్ మహమూద్ హబీబుల్లా ‘IMK’ని స్థాపించినట్లు NIA దర్యాప్తులో తేలింది. రహస్య సమావేశాలు, మతపరమైన భావజాల ప్రచారం, తీవ్రవాద సాహిత్యాన్ని పంపిణీ, IMK/JMB నాయకత్వానికి మద్దతుగా భారత్‌కు వ్యతిరేకంగా డిజిటల్ వేదికల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఈ మార్గాల ద్వారా భారతదేశంలో IMK/JBM ఉనికిని విస్తరించడానికి ఈ 11 మంది నిందితులు కుట్ర పన్నినట్లు NIA అధికారులు గుర్తించారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *