CRIMENATIONAL

జమ్మూకశ్మీర్‌ లో జరిగిన ఎన్ కౌంటర్ లో కరుడు కట్టిన లష్కరే తోయిబా కమాండర్ హతం

అమరావతి: జమ్మూకశ్మీర్‌ లోని బుద్గాం జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్ర‌వాదుల‌కు మ‌ధ్య బుధ‌వారం ఉద‌యం జరిగిన ఎదురు కాల్పుల్లో లష్కరే తోయిబా (LeT) కి చెందిన ఓ టాప్ కమాండర్ హతమయ్యాడు. హతమైన ఉగ్రవాదిని సులేమాన్ షా అలియాస్ ‘మూసా’ అలియాస్‌ ‘ఫౌజీ మూసా’ గా అధికారులు గుర్తించారు. బుద్గాంలో లష్కరే ఉగ్రవాద కార్యకలాపాలకు ఈ ఎన్‌కౌంట‌ర్‌ గట్టి ఎదురుదెబ్బ అని భద్రతావర్గాలు విశ్లేషిస్తున్నాయి. బుద్గాం జిల్లాలోని ఎగువ ప్రాంతాలైన యూస్‌మార్గ్‌ పరిధిలోని కోరాగ్ ఏరియాలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. చినార్ కార్ప్స్, జమ్మూకశ్మీర్ పోలీస్, సీఆర్పీఎఫ్ దళాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి.యూస్‌మార్గ్‌ లోని దూద్‌పత్రి అటవీ ప్రాంతంలో ఉగ్ర‌వాదుల‌ అనుమానాస్పద కదలికలను గమనించిన సైనికులు వారిని లొంగిపోవాలని హెచ్చరించారు.

ఇందుకు ఉగ్రవాదులు లొంగిపోకుండా కాల్పులకు తెగబడటంతో భద్రతాబలగాలు వేగంగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో సులేమాన్ షా అక్కడికక్కడే హతమయ్యాడని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. పిర్ పంజాల్ పర్వతశ్రేణుల్లో జరిగిన అనేక ఉగ్రదాడుల్లో మూసా కీలక నిందితుడిగా ఉన్నాడు. అత‌డి కోసం భద్రతాదళాలు చాలాకాలంగా గాలిస్తున్నాయి. గతంలో సెప్టెంబర్ 5న యూస్‌మార్గ్‌ కొండల్లో జరిగిన ఓ ఎన్‌కౌంటర్ నుంచి మూసా తృటిలో తప్పించుకున్నాడు. నేడు “మూసా” హతం అయ్యాడు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *