DISTRICTS

నగరంలో 14 ఐలాండ్లను సుందరీకరించేందుకు శంకుస్థాపనలు చేసిన మంత్రి నారాయణ

నెల్లూరు: శిలాఫలకాలకు ప్రాధాన్యత ఇవ్వనని,శంకుస్థాపన రోజే పనులు ప్రారంభిస్తాను అని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు.శనివారం నగరంలో 14 ఐలాండ్లను రూ.5.26 కోట్లతో అభివృద్ధి చేయడంతో పాటు ఫౌంటెన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్బంలో మంత్రి మాట్లాడారు. మంత్రి నారాయణ ఆయా కూడళ్లలోని మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

వీఆర్సీ సెంటర్‌ అంబేద్కర్‌ విగ్రహం, ట్రంక్‌రోడ్డు గాంధీ విగ్రహం, ఏసీ సెంటర్‌ ఏసీ సుబ్బారెడ్డి విగ్రహం, ఆజాద్‌ సెంటర్‌ వివేకానంద విగ్రహం, నర్తకి సెంటర్‌ ఎన్టీఆర్‌ విగ్రహం, కనకమహల్‌ సెంటర్‌ సుందరయ్య విగ్రహం,నక్కలోళ్ల సెంటర్‌ పట్టాభిరామిరెడ్డి విగ్రహం, బోసుబొమ్మ వద్ద సుభాష్‌చంద్రబోస్‌ విగ్రహం,వెంకటేశ్వరపురం జాకీర్‌హుస్సేన్‌ విగ్రహం, శెట్టిగుంట రోడ్డులో స్వచ్ఛభారత్‌ విగ్రహం, నవాబుపేట బీవీఎస్‌ స్కూల్‌ వద్ద ఇందిరాగాంధీ విగ్రహం, మినీబైపాస్‌లో పూలే, నేతాజీ విగ్రహాలు, యలమవారిదిన్నెలో అంబేద్కర్‌ విగ్రహం వద్ద పనులు చేపట్టనున్నారు. శంకుస్థాపన చేసిన 14 కూడళ్లలో ఫౌంటెన్ల పనులను త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ఆత్మకూరు బస్టాండ్‌ సెంటర్‌లోని పొట్టి శ్రీరాములు విగ్రహం స్థలమార్పుపై ఆర్యవైశ్యులు కోరారని, అందరూ ఏకాభిప్రాయానికి వస్తే విగ్రహాన్ని మార్చి కూడలిని సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.

సిటీలో 17 పాఠశాలల ఆధునీకరణకు రంగం సిద్ధం చేశామని తెలిపారు. ఎనిమిది పాఠశాలల్లో పనులు కొనసాగుతున్నాయని, మూడు పాఠశాలలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసి ప్రారంభించామని చెప్పారు. మరో మూడు పాఠశాలలకు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *