DISTRICTSEDU&JOBSOTHERS

జిల్లాలో 76 స్కూల్అసిస్టెంట్, 365 సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వనం-డీఈఓ

నెల్లూరు: నెల్లూరుజిల్లా పరిధిలోని ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లాపరిషత్, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాఠశాలలలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి తాత్కాలిక ప్రాతిపదికన పని చేసేందుకు అకడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నమని డీఈఓ ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వుల ప్రకారం నెల్లూరుజిల్లాకు మొత్తం 441 పోస్టులు (స్కూల్అసిస్టెంట్-76 పోస్టులు, నెలకు గౌరవవేతనంరూ.12,500/- సెకండరీ గ్రేడ్ టీచర్ 365 పోస్టులు, నెలకు గౌరవవేతనంరూ.10,000/-) మంజూరుచేయడం జరిగిందని పెర్కొన్నారు. పోస్టుల వివరాలు, సబ్జెక్టుల వారీగా ఖాళీలు, విద్యార్హతలు-పూర్తి సమాచారం కొరకు జిల్లా విద్యాశాఖాధికారి అధికారిక వెబ్సైట్ deonellore.50webs.com లో తెలుసుకోవచ్చాన్నారు. అర్హత-ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను అవసరమైన ధృవపత్రాలతో సహా సంబంధిత మండల విద్యాశాఖాధికారి (MEO /MRC) కార్యాలయంలో తేది: 21-08-2026లోపు అందజేయవలసిందిగా కోరారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *