AP&TG

18 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారే అవకాశం

అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయువ్యదిశగా కదులుతూ మరికొన్ని గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని విశాఖప‌ట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఈ వాయుగుండం ఈ నెల 16న తుపానుగా, 18న ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో ఈనెల 18, 19 తేదీల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.

ఈ నెల 18న శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేశారు. 19న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, పార్వతీపురం మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు చెప్పారు. ఈనెల 16 నుంచి తీరం వెంట గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్ఠంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు ఆదివారం సాయంత్రానికి తీరాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఈ నెల 16 నుంచి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీచేశారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *