AP&TGBUSINESSOTHERS

ఒప్పందాలే కాదు..ప్రాజెక్టుల అమలుపైనా దృష్టి పెట్టాలి-సీఎం చంద్రబాబు

స్పేస్, డిఫెన్స్ రంగాల కోసం..

సెమీకండక్టర్లు, ఏఐ, క్వాంటం, ఏరోస్పేస్..

విశాఖపట్నం: సీఐఐ భాగస్వామ్య సదస్సు రెండో రోజు ఎంఓయూల కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. కేవలం పెట్టుబడుల ఒప్పందాలు చేసుకోవడమే కాకుండా, ప్రాజెక్టులను త్వరితగతిన కార్యరూపంలోకి తీసుకురావాలని పారిశ్రామికవేత్తలకు సూచించారు.

ఐటీ శకం ముగుస్తోంది:- ఈ సందర్భంలో సీఎం సమక్షంలో వివిధ కంపెనీలు 12 ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. AP CRDA, ఏపీ మారిటైమ్ బోర్డ్, ఐటీ ఎలక్ట్రానిక్స్, P4కు సంబంధించి వివిధ కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఐటీ శకం ముగుస్తోందని,, ఏఐ, క్వాంటం శకం మొదలైందని సీఎం చంద్రబాబు తెలిపారు. సమర్థ, సుస్థిర నాయకత్వం ఉంటే మంచి ఫలితాలు వస్తాయన్నారు. నూతన సాంకేతికతలకు అనుగుణంగా సంస్కరణలు వస్తున్నాయన్నారు.తలసరి ఆదాయంలో ఏపీ 13వ స్థానంలో ఉందన్నారు.

భారీ పెట్టుబడులకు అవకాశాలు:- ప్రాజెక్టుల గ్రౌండింగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. సెమీకండక్టర్లు, కృత్రిమ మేధ (ఏఐ), క్వాంటం టెక్నాలజీ, ఏరోస్పేస్, స్పేస్, డిఫెన్స్ రంగాల్లో భారీ పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు. స్పేస్ రంగ పరిశ్రమల కోసం తిరుపతి సమీపంలో 5 వేల ఎకరాలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. దేశంలోని ఐఐటీలు ఏపీని పరిశోధనలకు ప్రయోగశాలగా మార్చుకుని నూతన ఆవిష్కరణలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పెట్టుబడుల ద్వారా సంపద సృష్టించడంతో పాటు పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.ఈ కార్యక్రమంలో మునిసిపాల్ శాఖ మంత్రి డా.పొంగూరు.నారాయణ,కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *