DISTRICTS

పిడతా పోలూరులో 70 సంవత్సరాల సమస్యకు త్వరలోనే పరిష్కారం-కలెక్టర్ హిమాన్షు శుక్లా

పల్లె వీక్షణం..

నెల్లూరు: జిల్లాలో వినూత్నంగా ప్రారంభించిన పల్లె వీక్షణం కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ముత్తుకూరు మండలం పిడతా పోలూరు గ్రామంలో శుక్రవారం నాడు నిర్వహించారు.MGNREGS, జలజీవన్ మిషన్, అంగన్వాడి సెంటర్, ఆరోగ్య కేంద్రo, డ్రిప్ ఇరిగేషన్, చెత్త నుండి సంపద తయారీ కేంద్రం, గ్రామస్తులతో ముఖాముఖి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ అనిమల్ హస్బెండరీ-సేర్ఫ్ కార్యక్రమాలను పరిశీలించిన అనంతరం స్థానిక సచివాలయం వద్ద ప్రజల నుండి అర్జులను స్వీకరించారు. అధికారులు గ్రామంలో గుర్తించిన పలు సమస్యల గురించి వివరించారు. పలువురు గ్రామస్తులు తెలిపిన గ్రామ సమస్యలను సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. అర్జీలు స్వీకరిణ అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ గత 70 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నపల్లె కాపులకు త్వరలో పట్టాలు పంపిణీ చేస్తామని తెలిపారు.

సహజసిద్ధంగా ఎరువులు తయారు చేస్తున్న సహాయక గ్రూపు మెంబర్ కళ్యాణికి ప్రభుత్వం తరఫునుంచి ఆర్థిక సహాయం చేసి వారి వ్యాపార అభివృద్ధికి తోడ్పడడం జరుగుతుందన్నారు. పిడత పోలూరు లోని కొన్ని ఎస్టీ కాలనీలలో లో -విద్యుత్ ఉన్నందున ఆ సమస్యను అధిగమించే విధంగా త్రీ పేజీ లైన్ ఏర్పాటు చేసి రెండు నెలలలో విద్యుత్ సమస్యను అధిగమించడం జరుగుతుందన్నారు. పల్లె వీక్షం కార్యక్రమం ద్వారా రెండు రోజులు ముందుగానే స్థానికంగా ఉన్న మేజర్ స్థానిక సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే విధంగా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన వివరించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *