INTERNATIONALNATIONALOTHERS

ఇండోనేషియాలో 7.7 తీవ్రతతో సంభవించిన భూప్రకంపనలు

38 మంది మృతి..

అమరావతి: తూర్పు ఇండోనేషియాలోని ఫ్లోరెస్‌ దీవి సమీపంలో శనివారం వేకువజామున 7.7 తీవ్రతతో సంభవించిన భూప్రకంపనలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. భూకంపం ధాటికి పలు భవనాలు దెబ్బతినగా, కనీసం 38 మంది మరణించారని ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.ప్రకంపనల నేపథ్యంలో కొద్దిసేపు సునామీ హెచ్చరిక జారీ చేయడంతో వందలాది మంది ప్రజలు ఎత్తైన ప్రాంతాలకు పరుగులు తీశారు.

అమెరికా జియోలాజికల్‌ సర్వే (USGS) ప్రకారం. ఫ్లోరెస్‌ దీవి ఉత్తర తీరానికి సమీపంలో భూకంప కేంద్రం నమోదైంది. ఎండె నగరానికి వాయువ్యంగా సుమారు 68 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూకంపం చాలా తక్కువ లోతులో సంభవించడంతో ప్రకంపనలు తీవ్రత ఎక్కువగా కనిపించాయి. అనంతరం అదే ప్రాంతంలో 6.1 తీవ్రతతో సహా పలు ప్రకంపనలు నమోదయ్యాయి. భూకంపం కారణంగా పలు భవనాలు దెబ్బతిన్నాయి. ఆసుపత్రుల్లోని రోగులు సైతం భయంతో బయటకు పరుగులు తీశారు. కొన్ని భవనాల గోడలకు పగుళ్లు ఏర్పడినట్లు స్థానికులు తెలిపారు. భూకంపం కారణంగా ఇప్పటివరకు ఒక పురుషుడు, ఒక మహిళ మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య, భవనాలకు జరిగిన నష్టం తదితర వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *