40% లోటు వర్షపాతంను 14 శాతంకు తగ్గించిన నైరుతి రుతుపవనాలు-భారీ వర్షాలకు అవకాశం!
అమరావతి: భాతరదేశంలో ఎల్ నినో ప్రభావంతో 40 శాతం మేరకు వర్షపాతం లోటు వుంటుందని ఒక్క ప్రక్క వాతావరణశాఖాధికారులు అంచనాలు వేస్తుండగా మరో ప్రక్క నైరుతి రుతుపవనాలు మరింత బలపడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు అసాధారణమైన మలుపు తీసుకున్నాయి. జూలైలో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉంటుందన్న అంచనాలను తారుమారు చేస్తూ, నెల రోజుల లోపే దేశంలో వర్షపాత లోటును 14 శాతంకు గణనీయంగా తగ్గించాయి. దిని ప్రభావం ఆగష్టులో కూడా భారీ వర్షాలకు అవకాశం ఉందని నిపుణులు అంచనాలు చేస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటి వరకు సరైన వర్షాలు లేక అల్లాడిపోయిన రైతులకు తాజా వానలు ఉపశమనం కల్పిస్తున్నాయి. వరుసగా కురుస్తున్న వానల వల్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దింతో వర్షపాత లోటు కూడా భారీగా తగ్గిపోయింది. ప్రస్తుతం దేశంలో వర్షపాతం లోటు 16 శాతానికి మాత్రమే చేరుకుంది. ఆగష్టులో భారీ వానలు తప్పవని అంచన వేశారు. ఇప్పటికే మహారాష్ట్రతోపాటు మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో భారీ వర్షాలు కురుస్తుండగా, ఇవి ఇంకొన్ని రోజులు ఇలాగే కొనసాగుతాయి. రాజస్థాన్, గుజరాత్‌లకు కూడా భారీ వర్షాలకు అవకాశం ఉందని అంచన. భారీ వర్షాలు కారణంగా రిజర్వాయర్లు నిండుతుండటం, నదులు జలకళ సంతరించుకోవడం వల్ల ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు లాభదాయకంగా ఉంటుందని ఐఎండీ నిపుణులు అంచనావేస్తున్నారు. ఎల్ నినో ప్రభావం దేశంపై అ మేరకు వుండకపోవచ్చు అని ఒక అంచన..?

