కరెంట్ ఆఫీస్ సెంటర్,నవాబుపేటలో రోడ్డు ఆక్రమణలు తొలగింపు
నెల్లూరు: నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ ఆధ్వర్యంలో నగరంలోని కరెంట్ ఆఫీస్ సెంటర్, నవాబుపేట పుల్లమ్మ సత్రం ప్రాంతాలలో రోడ్డు ఆక్రమణలను శనివారం తొలగించారు. ప్రభుత్వ స్థలాలు, ఆర్ అండ్ బి రోడ్లు, కార్పొరేషన్ స్థలాలను ఆక్రమించి రోడ్లపై ఎలాంటి శాశ్వత నిర్మాణాలను చేపట్టరాదని, తప్పనిసరిగా వాటిని తొలగించి వేస్తామని ఈ సందర్భంగా కమిషనర్ స్థానిక ప్రజలకు స్పష్టం చేశారు. నిర్దేశించిన రోడ్డు మార్జిన్ లోపు మాత్రమే వ్యాపారస్తులు వర్తకాలు నిర్వహించుకోవాలని, ట్రాఫిక్ అంతరాయాలకు, రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే రోడ్డు ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని కమిషనర్ హెచ్చరించారు. రోడ్డు ఆక్రమణల తొలగింపు కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ అసిస్టెంట్ సిటీ బ్యానర్ వేణు, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

