మత్స్యకారులకు ఇచ్చిన మాట-మన ఊరు మాటా-మంతి-పవన్ కళ్యాణ్
రూ.75,52,800 ఆర్థిక సాయం..
అమరావతి: పవన్ కళ్యాణ్ గతంలో ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారులకు ఇచ్చిన మాట మేరకు 100 రోజుల ప్రణాళిక కార్యరూపంలో బాగంగా ఉప ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్. తమిళనాడు, కేరళం రాష్ట్రాల్లో ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలపై శిక్షణ పొందారు. శనివారం రాత్రి కాకినాడలో నిర్వహించిన మన ఊరు మాటా-మంతి కార్యక్రమంలో మొదటి అడుగుగా అమీనాబాద్ హార్బర్ డిజైన్ లోపంతో దెబ్బతిన్న సుమారు 29 బోట్లకు పరిహారాన్ని చెక్కుల రూపంలో మత్స్యకారులకి అందించారు. హార్బర్ డిజైన్ లోపాలను సవరించేందుకు మరో రూ.80 కోట్లు మంజూరుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు ప్రకటించారు. డిజైన్ లోపాల కారణంగా అమీనాబాద్ ఫిషింగ్ హార్బర్‌లో అలల తాకిడికి 16 పడవలు పూర్తిగా, 13 పడవలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. బాధితులకు తక్షణ ఉపశమనం కలిగిస్తూ మొత్తం 29 పడవలకు గానూ రూ.75,52,800 ఆర్థిక సాయాన్ని చెక్కుల రూపంలో పంపిణీ చేశారు.
100 మంది మత్స్యకారులకు బోటు ఇంజన్లను:- ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద యు.కొత్తపల్లి మండలానికి చెందిన వంద మంది మత్స్యకారులకు అధునాతన బోటు ఇంజన్లను పంపిణీ చేశారు. మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరచడమే ధ్యేయంగా రూ.1.42 కోట్ల విలువైన 10 హెచ్.పి.20 హెచ్.పి. ఇంజన్లను అందించారు. మత్స్యకారులపై ఎలాంటి అదనపు ఆర్థిక భారం పడకుండా ఈ ఇంజన్లను సమకూర్చారు. ఒక్కో ఇంజన్ ధరపై 40 శాతం రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ, 10 శాతం లబ్ధిదారుని వాటాగా నిర్ణయించారు. లబ్ధిదారులు చెల్లించాల్సిన మిగిలిన 50 శాతం నిధులను పిఠాపురం నియోజకవర్గం నిధుల నుండి చెల్లించాలని అధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశించారు.

