AP&TG

శనివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

అమరావతి: ఉపరితల ఆవర్తనము ప్రభావంతో రేపటికి దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తదుపరి 48 గంటల్లో పశ్చిమవాయువ్య దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతంలో మరింత బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. అల్పపీడనం ఏర్పడే నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. శనివారం ప్రకాశం, నెల్లూరు,కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *