మేయర్ అభ్యర్థిత్వానికి ఇప్పటి వరకు ఏలాంటి దరఖాస్తులు రాలేదు-కమీషనర్
సందేహాలు, ఫిర్యాదులకు టోల్ ఫ్రీ 1800 425 1113..
నెల్లూరు: నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా శుక్రవారం నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన నేపథ్యంలో మేయర్ అభ్యర్థిత్వానికి ఇప్పటి వరకు ఏలాంటి దరఖాస్తులు రాలేదని, కార్పొరేటర్ల అభ్యర్థిత్వానికి వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున 12, 14 డివిజన్లకు సంబంధించి రెండు దరఖాస్తులు అందుకున్నామని అడిషనల్ ఎలక్షన్ అథారిటీ/కమిషనర్ వై.ఓ నందన్ ప్రకటించారు.
సందేహాలు, ఫిర్యాదులు:- సాధారణ ఎన్నికలకు సంబంధించి సందేహాలు, ఫిర్యాదులు, ఇతర సమాచారం అందించేందుకు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో ప్రత్యేకమైన టోల్ ఫ్రీ వ్యవస్థను ప్రజలకు అందుబాటులో ఉంచినట్లు అడిషనల్ ఎలక్షన్ అథారిటీ / కమిషనర్ వై.ఓ నందన్ శుక్రవారం తెలియచేశారు.
సంప్రదించవలసిన నంబర్లు:- టోల్ ఫ్రీ 1800 425 1113, ల్యాండ్ లైన్ 0861 2316777, 0861 2356777 నెంబర్లు, వాట్సాప్ ద్వారా 94940 18118 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.

