CRIMEDISTRICTS

మంజు రైస్ & కంపెనీపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు

రూ.42.30 లక్షల విలువైన 1,901 బస్తాల బియ్యం స్వాధీనం..

నెల్లూరు: నగరంలో అక్రమంగా బియ్యం వ్యాపారం నిర్వహిస్తున్న మంజు రైస్ & కంపెనీపై అధికారుల దాడి- రూ.42.30 లక్షల విలువైన 1,901 బస్తాల బియ్యం (555.24 క్వింటాళ్ళ) స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ యూనిట్ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నెల్లూరు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ యూనిట్ అధికారులు, పౌర సరఫరాల అధికారులతో కలిసి ఈ రోజు నెల్లూరు నగరంలోని పెద్దబజార్, లోని డైకస్ రోడ్డులో ఉన్న మంజు రైస్ & కంపెనీపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

తనిఖీలలో సదరు దుకాణ యజమాని జిల్లా సివిల్ సప్లైస్ అధికారి (DSO), నెల్లూరు వారి వద్ద తప్పనిసరిగా పొందవలసిన రిజిస్ట్రేషన్ లేకుండానే హోల్సేల్-రిటైల్ బియ్యం వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. నిబంధనల ప్రకారం నిర్వహించాల్సిన స్టాక్ రిజిస్టర్లు, కొనుగోలు-అమ్మకాల బిల్లులు నిర్వహించకపోవడంతో పాటు, ఫుడ్ స్టాక్ పోర్టల్లో తప్పనిసరిగా నమోదు చేయవలసిన స్టాక్ వివరాలను కూడా నమోదు చేయలేదని అధికారులు గుర్తించారు.

సెక్షన్ 6(A) ప్రకారం కుసు నమోదు:- ఈ నేపథ్యంలో అధికారులు పంచనామా నిర్వహించి, వివిధ బ్రాండ్లకు చెందిన 1,901 బస్తాల బియ్యం, మొత్తం 555.24 క్వింటాళ్ల బరువు గలవి, సుమారు రూ.42,30,674.00 విలువైన నిల్వలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో నిత్యావసర వస్తువుల చట్టం, 1955లోని సెక్షన్ 6(A) ప్రకారం పౌర సరఫరాల అధికారుల ద్వారా నెల్లూరు జాయింట్ కలెక్టర్ ముందు కేసు దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు.

ప్రభుత్వం నిర్దేశించిన ధరల పట్టిక:- జిల్లాలోని అందరూ రైస్ మిల్లర్లు, బియ్యం హోల్ సేల్-రిటైల్ వ్యాపారస్తులు ప్రభుత్వం నిర్దేశించిన బియ్యం ధరలు కన్నా ఎక్కువ ధరలకు విక్రయించినట్లయితే  అలాంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొవడం జరుగుతుందని  హెచ్చరించారు.అలాగే ప్రభుత్వం నిర్దేశించిన ధరల పట్టికను ఖచ్చితంగా అన్నీ షాపుల ముందు వుంచాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా నిత్యావసర వస్తువుల వ్యాపారం నిర్వహించే వారిపై-అక్రమ నిల్వలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *