నవంబర్ 30 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం
డిసెంబర్ 2 నాటికి వాయుగుండంగా బలపడే?..
నెల్లూరు,అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో..
అమరావతి: దక్షిణ అండమాన్ సముద్రంపై ఏర్పడే ఉపరితల ఆవర్తన ప్రభావంతో నవంబర్ 30వ తేదీ నాటికి అండమాన్-ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. డిసెంబర్ 2వ తేదీకు ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు ప్రయాణించే అవకాశముంది. అయితే సముద్రంలోనే బలహీనపడే సూచనలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడుతున్న వాతావరణ మార్పుల నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు వాతావరణ శాఖ సూచనలను గమనించాలని అధికారులు సూచిస్తున్నారు.
శనివారం:- నెల్లూరు,అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అలాగే మార్కాపురం,ప్రకాశం,మిగతా రాయలసీమ జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

