NATIONALPOLITICS

లోక్‌సభ సీట్లు 50 శాతం పెంపునకు ఆమోదం-కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం

మహిళలకు రిజర్వేషన్లు కల్పించే..

అమరావతి: దేశ రాజకీయ వ్యవస్థలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలను ప్రస్తుత సంఖ్యతో పోలిస్తే 50 శాతం పెంచే ప్రతిపాదన అలాగే లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ద్వారా మహిళలకు రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లును కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.

* అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం

* పెరిగిన స్థానాల సంఖ్య, రాష్ట్రాల మధ్య ప్రస్తుత సీట్ల నిష్పత్తిని 2051 వరకు కొనసాగించే ప్రతిపాదన

* మహిళా రిజర్వేషన్ అమలుకు వీలుగా రాజ్యాంగ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

* లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా చర్యలు

* రాష్ట్రాల మధ్య ప్రస్తుత ప్రాతినిధ్య నిష్పత్తికి భంగం కలగకుండా సీట్ల పెంపునకు ప్రతిపాదన

* నవంబర్ 30 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు

* డిసెంబర్ 2 నుంచి రాజ్యసభ సమావేశాలు.. డిసెంబర్ 3 వరకు సమావేశాలు కొనసాగే అవకాశం.

ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరిగే అవకాశం:-  పునర్విభజన ప్రక్రియ తర్వాత లోక్‌సభలో మొత్తం సీట్ల సంఖ్య 850కి చేరే అవకాశం ఉంది. పునర్విభజన బిల్లుతో పాటు మహిళా రిజర్వేషన్‌ను కూడా అనుసంధానించడం వల్ల 2029 లోక్‌సభ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం ప్రాతినిధ్యం ఖాయం కానుంది. అంచనాల ప్రకారం ప్రధాన రాష్ట్రాల్లో సీట్ల పెంపు ఇలా ఉండబోతుంది.. ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుతం 80 లోక్‌‌సభ సీట్లు ఉండగా అది 120కి పెరగనుంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 25 సీట్లు ఉండగా అవి 38కి,, తెలంగాణలో 17 నుంచి 26కు, మహారాష్ట్ర 48 ఉండగా 72కు, పశ్చిమ బెంగాల్ 42 నుంచి 63కు, బిహార్ 40 నుంచి 60కి, తమిళనాడు 39 నుంచి సుమారు 59కి సీట్లు పెరిగే అవకాశం వుందన్న ఆంచన..?

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *