నెల్లూరు,తిరుపతి మేయర్లు టీడీపీ-డిప్యూటివ్ మేయర్లు బీజెపీ,జనసేన
ప్రమాణ స్వీకారం..
నెల్లూరు/తిరుపతి: నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ గా పి.రూప్ కుమార్ (టీడీపీ), డిప్యూటివ్ మేయర్ గా కె.రఘునాథరాజు (బీజెపీ 60వ డివిజన్ కార్పొరేటర్)ల చేత సోమవారం జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ప్రమాణ స్వీకారం చేయించారు. తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ గా(టీడీపీ) ఎం.శ్రీనివాస ప్రసాద్, డిప్యూటివ్ మేయర్ గా పి.విజయ(జనసేన 51వ డివిజన్ కార్పొరేటర్)ల చేత జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ ప్రమాణ స్వీకారం చేయించారు.

