ఈ నెల13న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం-వాతావరణ శాఖ
14, 15 తేదీల్లో..
అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడి, పశ్చిమ వాయువ్యంగా పయనిస్తూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.ఇది ఈ నెల 18 లేదా 19 నాటికి ఉత్తర తమిళనాడు తీరానికి చేరువయ్యే క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వుందని వెల్లడించింది.
14, 15 తేదీల్లో:- ఈ అల్పపీడన బలోపేతమయ్యే క్రమంలో ఈ నెల 14, 15 తేదీల్లో అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో అలల ఉద్ధృతి విపరీతంగా పెరగనుందని అధికారులు హెచ్చరించారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశమున్నందున, అలల ఉద్ధృతిని దృష్టిలో ఉంచుకుని, మత్స్యకారులు ఈ నెల 14, 15 తేదీల్లో సముద్రంలో వేటకు వెళ్లవద్దని స్పష్టం చేసింది.

