INTERNATIONALNATIONALOTHERS

రష్యా-ఉక్రెయిన్ లు చర్చలు, దౌత్యం ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలి-ప్రధాని మోదీ

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో..

అబుధాబిలో జరగనున్న సమావేశం..

అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో సోమవారం ఫోన్‌లో మాట్లాడారు. రష్యా-ఉక్రెయిన్ ల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. శాంతియుత పరిష్కారం కోసం చేసే ప్రయత్నాలకు సహకరించేందుకు భారతదేశం సిద్ధంగా ఉందని ఆయన తెలియజేశారు. భారత్, ఉక్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసే మార్గాల గురించి కూడా ఇద్దరు నేతలు చర్చించారు.ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న సంఘర్షణ పట్ల, భారతదేశం మానవతా దృక్పథంతొ మద్దతు ఇస్తుందని పునరుద్ఘాటించారు. అలాగే ఇరు దేశాల మధ్య వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే అంశాలపైనా ఇద్దరు నేతలు చర్చించారు.

అబుధాబిలో జరగనున్న సమావేశం:- మోదీతో ఫోన్‌లో మాట్లాడిన విషయాన్ని జెలెన్‌స్కీ ‘ఎక్స్‌’లో వెల్లడించారు. తాజా దౌత్య పరిణామాలతో పాటు అబుధాబిలో జరగనున్న సమావేశానికి ఉక్రెయిన్‌ చేస్తున్న సన్నాహాల గురించి కూడా మోదీకి వివరించానని ఆయన తెలిపారు. యుద్ధాన్ని ముగించేందుకు ఉక్రెయిన్‌ ముందుకు వెళ్తోందని, రష్యా కూడా అదే విధంగా ఉద్రిక్తతలను తగ్గించేందుకు ముందుకు రావాలన్నారు. ఇది యుద్ధాన్ని కొనసాగించే సమయం కాదని, ముగించాల్సిన సమయమని మోదీ పలుమార్లు స్పష్టం చేసినట్లు జెలెన్‌స్కీ గుర్తుచేశారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *