NATIONAL

మానసికమైన నక్సలైట్ భావజాలంతో సమాజంలో విద్వేషాలను రగిల్చే వారిని-ప్రధాని మోదీ

నక్సలిజం రహితంగా జరుపుకుంటున్న తొలి దీపావళి..

సైనికులతో గడిపే ప్రతి దీపావళి నాకు చిరస్మరణీయం..

అంతర్గత భద్రతలో ప్రాణాలను పణంగా పెట్టి..

అమరావతి: నక్సలిజంపై దశాబ్దాలుగా కొనసాగిన పోరాటంలో కీలక మైలురాయి సాధించామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని సమస్యాత్మక ప్రాంతమైన బస్తర్‌లో భారత వీర జవాన్ల నడుమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జవాన్లకు స్వీట్లు తినిపించి,దీపావళి వేడుకలను జరుపుకున్నారు. ఆదివారం ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లా కరణ్‌పూర్‌లో ఉన్న కోబ్రా (CoBRA) ఆపరేషన్స్ బేస్‌ను ప్రధాని సందర్శించారు. అక్కడ భద్రతా బలగాలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. నక్సలిజంపై పోరాటంలో సైనికులు, భద్రతా సిబ్బంది చేసిన త్యాగాలను ఆయన కొనియాడారు. సరిహద్దుల్లో, అంతర్గత భద్రతలో ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని కాపాడుతున్న భద్రతా బలగాల సమక్షంలో పండుగ జరుపుకోవడం తనకు ఎంతో గర్వకారణమని ప్రధాని అన్నారు. ఈ సందర్భంగా నక్సలిజం నిర్మూలనలో సైనికులు సాధించిన చారిత్రక విజయాన్ని కొనియాడుతూనే, సమాజంలో తిష్టవేసిన (ధిమాకి నక్సల్స్-మానసికంగా నక్సలైట్ భావజాలంతో- సమాజంలో విద్వేషాలను రగిల్చే) మానసిక నక్సలైట్లపై విజయం సాధించాల్సి వుందన్నారు. బస్తర్‌లో విధులు నిర్వర్తిస్తున్న సైనికులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తూ. ‘‘ ధైర్యవంతులైన సైనికులతో గడిపే ప్రతి దీపావళి నాకు చిరస్మరణీయం. ఈసారి మీ అందరితో కలిసి పండుగ చేసుకునేందుకు నేను బస్తర్ నేలకు వచ్చాను. ఒకప్పుడు నక్సలైట్ల భీభత్సానికి గురైన ఈ ప్రాంతంలో, నేడు మీ త్యాగాలు, అచంచలమైన అంకితభావం వల్ల నక్సలిజం అంతమై, నూతన అభివృద్ధి శకం ప్రారంభమైంది. దేశం పూర్తిగా నక్సలిజం రహితంగా జరుపుకుంటున్న తొలి దీపావళి ఇదే’’ అని వ్యాఖ్యనించారు.

అమరవీరులైన సైనికుల త్యాగాలతో:- దేశ అంతర్గత భద్రతను కాపాడే క్రమంలో ప్రాణాలర్పించిన అమరవీరులకు ప్రధాని ఘన నివాళులర్పించారు. CRPF,,BSF,,ITBP,,SSB,,RBIతో పాటు రాష్ట్ర పోలీసు సిబ్బంది చేసిన త్యాగాలకు దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందన్నారు. ఈ పోరాటంలో ప్రత్యేకించి బస్తర్ ఫైటర్స్ వంటి యూనిట్లకు చెందిన కమాండోలు, మహిళా సైనికులు కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. ఒకప్పుడు దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లోని దాదాపు 230కి పైగా జిల్లాలు నక్సలిజం కోరల్లో చిక్కుకుని, సాయంత్రం కాగానే జనజీవనం స్తంభించిపోయేదని, ప్రజలు ఓటు హక్కును సైతం వినియోగించుకోలేని దుస్థితి ఉండేదని గుర్తుచేశారు. ఆ క్లిష్ట పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని, దేశాన్ని సైనికులే గట్టెక్కించారని కొనియాడారు.

సమాజంలో విద్వేషాలను రగిల్చే మానసిక నక్సలైట్లను:- తుపాకీ పట్టిన నక్సలిజం క్షేత్రస్థాయిలో నిర్మూలించబడినప్పటికీ, సమాజంలో విద్వేషాలను రగిల్చే మానసిక నక్సలైట్లు ఇంకా మిగిలే ఉన్నారని ప్రధాని మోదీ హెచ్చరించారు. అమాయక ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ రెచ్చగొట్టే కుట్రలు చేస్తున్నారని, అలాంటి మానసిక నక్సలైట్లను కూడా మనం ఏకతాటిపై నిలిచి ఓడించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *