CRIMENATIONAL

కర్మభూమి ఎక్స్‌ ప్రెస్’ రైలులో అగ్నిప్రమాదం

అమరావతి: పంజాబ్‌లోని సిర్హింద్-రాజ్‌పుర మధ్య ప్రయాణిస్తున్న ‘కర్మభూమి ఎక్స్‌ ప్రెస్’ రైలులోని నాలుగు బోగీల్లో అగ్నిప్రమాదం సంభవించింది. అమృత్‌సర్ నుంచి న్యూ జల్పాయ్‌గురి వెళ్తున్న 12508 నంబర్ కర్మభూమి ఎక్స్‌ ప్రెస్‌లో శుక్రవారం మధ్యాహ్నం  ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సరాయ్ బంజారా స్టేషన్ సమీపానికి రాగానే ఇంజిన్ నుంచి 5వ బోగీలో తొలుత మంటలు కనిపించాయి. ఆ తర్వాత మరో మూడు బోగీలకు వ్యాపించాయి. దీంతో రైలులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి రైలును నిలిపివేయడంతో ప్రయాణికులంతా సురక్షితంగా దిగిపోయారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, అత్యవసర సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. రైలు బోగీల్లో పెద్దఎత్తున మంటలు ఎగసిపడుతుండటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే, ప్రమాదానికి కచ్చితమైన కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *