ఏపీఈఆర్సీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం అనంతరం అమ్మవారిని దర్శించుకున్న బినోయ్ కుమార్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (APERC) చైర్మన్గా నియమితులైన విశ్రాంత ఐఏఎస్ అధికారి బినోయ్ కుమార్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 3వ తేదీన జీఓ ఎంఎస్ నంబర్ 87 ద్వారా బినోయ్ కుమార్ను ఏపీఈఆర్సీ చైర్మన్గా నియమించింది. ఈ నేపథ్యంలో విజయవాడలోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ ఆయనతో చైర్మన్గా ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం బినోయ్ కుమార్ విజయవాడలోని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కిషోర్ కుమార్, ఏఈఓ రమేష్ బాబు దర్శన ఏర్పాట్లు చేశారు.

