MOVIESNATIONALOTHERS

బాలీవుడు దిగ్గజ నటుడు ధర్మేంద్ర కన్నుమూత

అమరావతి: బాలీవుడు దిగ్గజ నటుడు ధర్మేంద్ర(89) సోమవారం కన్నుమూశారు.. ధర్మేంద్ర కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ,,చికిత్స తీసుకుంటున్నారు..ఆయన ముంబయిలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. కొంతసేపటి కిందటే ముంబయిలో అంత్యక్రియలు నిర్వహించారు.1935 డిసెంబర్ 8న పంజాబ్‌లో జన్మించిన ధర్మేంద్ర,, ధర్మేంద్ర పూర్తి పేరు ధరమ్‌సింగ్ డియోల్. 300కు పైగా చిత్రాల్లో నటించారు.బాలీవుడ్ హీమ్యాన్‌గా ధర్మేంద్రకు గుర్తింపు వుంది.. ‘షోలే’ చిత్రంతో ధర్మేంద్ర సినీ కెరీర్‌ను మలుపు తిరిగింది. 1997లో ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నారు. సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం 2012లో ఆయనను పద్మ భూషణ్​ అవార్డుతో సత్కరించింది.

బాలీవుడ్‌ లెజెండరీ నటుడు ధర్మేంద్ర మృతి పట్ల అయన కుటుంబసభ్యులకు చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ లు ప్రగాఢ సానుభూతి తెలిపారు..కోట్లాది మంది అభిమానుల హృదయాలను తన నటన ద్వారా గెలుచుకున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు..ధర్మేంద్ర మృతికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *