రాప్తాడులో విద్యార్దినిపై దాడి చేసిన యువకుడిపై పోలీసులు కాల్పులు
(రాప్తాడు జిల్లా పరిషత్ పాఠశాలలో పాఠశాల తరగతి గదిలో ఉన్న 10 క్లాస్ బాలికపై, చెట్లు కట్ చేసే రంపం మెషీన్ తో ఓ యువకుడు శనివారం దాడి చేశాడు. శనివారం ఉదయం పాఠశాలలో ఉపాధ్యాయురాలు మ్యాథ్స్ క్లాస్ చెబుతుండగా, చెట్లు నరికే రంపం మెషిన్‌తో తరగతి గదిలోకి ప్రవేశించిన దుండగుడు,ఉన్మాదిలా ప్రవర్తిస్తూ, విద్యార్థిని ముఖం, ఒంటిపై ఎక్కడికక్కడ నరికాడు. ఆ దాడితో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని ప్రాణాపాయస్థితిలోకి వెళ్లింది. అడ్డుకోబోయిన మరో విద్యార్థిని కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. రక్తపు మడుగులో పడిఉన్న ఇద్దరినీ స్థానికులు అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.)
అమరావతి: అనంతపూర్ రాప్తాడు క్లాస్ బాలికపై, చెట్లు కట్ చేసే రంపం మెషీన్ తో దాడి చేసిన హేమంత్ అనే యువకుడు అనంతపూర్ జిల్లా ఆత్మకూరులో అడవిలో లో దాచుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.దింతో పోలీసులు అతన్ని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. అడవిలోకి వెళ్లగా, పోలీసులను చూసి తప్పించుకొని పారిపోతూ, పోలీస్ల పైన రాళ్లతో దాడులకు పాల్పడ్డాడు. హేమంత్ పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులకు పలువురు పోలీసులకు గాయాలు కావడంతో,, పోలీసుల ఆరు రౌండ్ హేమంత్ పై కాల్పులు జరిపినట్లు సమాచారం.. పోలీసుల కాల్పుల్లో హేమంత్ కి గాయాలైనట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన అతడిని పోలీసులు హుటాహుటిన అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.చికిత్స జరుగుతుండగా హేమంత్ చనిపోయినట్లుగా సమాచారం.? పోలీసులు ఇంకా అధికారికంగా ధ్రువీకరించడం లేదు.

